Mark Zuckerberg: 2 వేల ఏండ్ల చెట్టు ముందు కూతురితో జుక‌ర్‌బ‌ర్గ్‌.. అద్భుతం అంటున్న నెటిజ‌న్లు

త‌న జీవితంలోని ముఖ్యమైన సంద‌ర్భాల్ని అభిమానుల‌తో పంచుకునే అత‌ను.. తాజాగా త‌న కూతురితో క‌లిసి రోడ్ ట్రిప్ వెళ్లిన ఫొటోల్ని ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేశాడు.

Mark Zuckerberg (Credits: X)

Hyderabad, Oct 31: మెటా చీఫ్ మార్క్‌ జుక‌ర్‌బ‌ర్గ్(Mark Zuckerberg) ఆన్‌ లైన్‌ (Online) లో ఎంతో చురుకుగా ఉంటాడ‌ని తెలిసిందే. త‌న జీవితంలోని ముఖ్యమైన సంద‌ర్భాల్ని అభిమానుల‌తో పంచుకునే అత‌ను.. తాజాగా త‌న కూతురితో క‌లిసి రోడ్ ట్రిప్ (Road Trip) వెళ్లిన ఫొటోల్ని ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేశాడు. పెద్ద కూతురుతో క‌లిసి ప్ర‌కృతి ఒడిలో సేద తీరుతున్నాడు. ‘ఈ వీకెండ్‌లో తండ్రీ కూతురు రోడ్ ట్రిప్ లో భాగంగా అత్యంత పెద్ద‌దైన సెక్వియోస్(sequoias) చెట్టును చూసేందుకు వెళ్లాం. 2 వేల ఏండ్ల నాటి ఈ చెట్టు నిజంగా ఒక అద్భుతం’ అని ఆ ఫొటోల‌కు క్యాప్ష‌న్ రాసుకొచ్చాడు. ఒక ఫొటోలో కొనిఫెర‌స్ జాతికి చెందిన ప్ర‌పంచంలోనే ఎత్తైన‌, 2 వేల ఏండ్ల నాటి ఒక‌ పెద్ద చెట్టును త‌న కూతురితో క‌లిసి జుక‌ర్‌బ‌ర్గ్ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాడు. మ‌రో ఫొటోలో ఒక ఎత్తైన చెట్టు ముందు తండ్రీ కూతుళ్లు న‌వ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఆ ఫొటోలు చూసిన చాలామంది అద్భుతం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Giant Music System Falls: డ్యాన్స్‌ చేస్తున్న గుంపుపై పడిన భారీ మ్యూజిక్‌ సిస్టమ్‌.. పలువురికి గాయాలు (వీడియో వైరల్)

 

View this post on Instagram

 

A post shared by Mark Zuckerberg (@zuck)



సంబంధిత వార్తలు