Viral Video: వీడియో ఇదిగో, రూ.1.5 లక్షల నగదు ఉన్న సంచిని తీసుకుని పారిపోయిన కోతి, చివరకు ఏమైందంటే..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.5 లక్షల నగదుతో ఉన్న సంచితో ఓ కోతి చెట్టు ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యూపీ రాష్ట్రంలోని షాబాద్‌లోని రిజిస్ట్రీ ఆఫీసుకు హుస్సేన్ అనే వ్యక్తి డబ్బుల సంచితో వచ్చాడు. తన బైకును కార్యాలయం వెలుపల నిలిపాడు

Monkey

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రూ.1.5 లక్షల నగదుతో ఉన్న సంచితో ఓ కోతి చెట్టు ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. యూపీ రాష్ట్రంలోని షాబాద్‌లోని రిజిస్ట్రీ ఆఫీసుకు హుస్సేన్ అనే వ్యక్తి డబ్బుల సంచితో వచ్చాడు. తన బైకును కార్యాలయం వెలుపల నిలిపాడు. ఈ బైకుకే డబ్బుల సంచిని కూడా తగిలించాడు. కొద్దిసేపటికి బయటకు వచ్చిన అతడు బ్యాగులోని రూ.1.5 లక్షలు కనిపించకపోవడంతో ఖంగుతిన్నాడు. డబ్బు ఉన్న బ్యాగును ఓ కోతి ఎత్తుకునిపోయిందని తెలిసి అతడికి ఏం చేయాలో పాలుపోలేదు.

ఈ లోపు రంగంలోకి దిగిన స్థానికులు బ్యాగుతో చెట్టుపై ఉన్న కోతిని ఏమార్చి బ్యాగ కిందకు జారవిడిచేలా చేసేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీంతో హుస్సే‌న్‌కు పోయిన ప్రాణం లేసొచ్చింది. కాగా, ఈ ఘటనపై జిల్లా అధికారులు స్పందించారు. ఆ ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, ఈ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Monkey

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement