Nagpur Shocker: ఒళ్లు గగుర్పొడుస్తున్న వీడియో ఇదిగో, సరదాపడి చేసిన స్టంట్‌తో యువకుడు మృతి, డ్యాంలో మునిగిపోతున్న దృశ్యాలు వైరల్
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు మకర్‌ధోక్డా డ్యామ్ కు ఆగస్టు 15న టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
మహారాష్ట్రలో యువకుడు తన స్నేహితులతో కలిసి జలాశయం వద్ద రిస్కీ స్టంట్స్ చేసి ప్రాణాలే కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు స్నేహితులు మకర్‌ధోక్డా డ్యామ్ కు ఆగస్టు 15న టూర్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడకు వెళ్లిన అనంతరం అలుగుపారుతున్న డ్యామ్ కట్టపైకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వీడియో..బీర్ టిన్‌లో ఇరుక్కున్న పాము తల, మూడు గంటల పాటు నరకయాతన, చివరకు!
ఒకరి సాయంతో ఒకరు పైకి పాకుతుంటారు. వారిలో ఒకరు పైకి చేరుకుని విజయ సంకేతం ఇస్తాడు. అనంతరం అతను మరో స్నేహితుడిని కూడా పైకి లాగాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో రెండో స్నేహితుడి చేతిని పట్టుకోగా, అతడు జారిపోయాడు. మిగతా ఇద్దరు కిందకి జారిపోగా.. చేయందించిన యువకుడు డ్యాంలోకి పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో పైకి రావాలని చాలా సేపు పోరాడాడు. అతన్ని గమనించిన స్థానికులు బయటకి తీద్దామనుకునేలోపే పూర్తిగా నీటిలో మునిగిపోయాడు. యువకుడు మునిగిపోతున్న దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీశారు. అవి నెట్టింట వైరల్‌గా మారాయి. గజఈతగాళ్ల సాయంతో అతని మృతదేహాన్ని బయటకి తీశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)