Whole-Eye Transplant: వైద్యచరిత్రలో అద్భుతం.. ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్చిన అమెరికా సర్జన్లు

ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి శస్త్రచికిత్సను అమెరికా సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా.. ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు.

Whole-Eye Transplant (Credits: X)

Newyork, Nov 11: ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి (Whole-Eye Transplant) శస్త్రచికిత్సను అమెరికా (America) సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా..ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు. ఈ శస్త్రచికిత్సలో దాత నుంచి సేకరించిన ఎడమ కన్నును అరాన్‌ జేమ్స్‌ అనే లైన్‌ వర్కర్‌ కు అమర్చారు. గతంలో ఇలా పూర్తి కంటి మార్పిడి చికిత్స జంతువుల్లో కొంతవరకు విజయవంతమై పాక్షికంగా చూపు వచ్చింది. జేమ్స్‌ కు అమర్చిన కన్ను ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.

Diwali 2023: దీపావళి సెలవు తేదీ మార్పుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన, హాలిడేను ఆదివారం నుంచి సోమవారానికి మార్చుతున్నట్లు ఉత్తర్వులు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement