Representative Image (ANI)

Newyork, Feb 3: అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగిన ఘటనలను మరిచిపోకముందే మరో ప్రమాదం జరిగింది. హ్యూస్టన్ నుంచి న్యూయార్క్ వెళ్తున్న విమానంలో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. వెంటనే ప్యాసింజర్స్ ను దించేసిన సిబ్బంది.. అవసరమైన చర్యలు చేపట్టారు. అమెరికా (America) రాజధాని వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం కూలిపోయిన ఘటనను (US Plane Crash) మరిచిపోకముందే అదే అమెరికాలో మొన్నటికి మొన్న మరో విమాన ప్రమాదం జరిగింది. ఆరుగురితో ప్రయాణిస్తున్న ఓ చిన్న విమానం ఫిలడెల్ఫియాలో కుప్పకూలింది. ఓ మాల్ సమీపంలో విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లకు నిప్పు అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ప్రకారం శుక్రవారం సాయంత్రం రూజ్‌ వెల్ట్ మాల్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కుప్పకూలింది. విమానాశ్రయానికి 5 కిలోమీటర్ల లోపే విమానం ప్రమాదానికి గురైనట్టు అధికారులు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా వసంత పంచమి వేడుకలు.. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో కిటకిటలాడుతున్న ఆలయాలు

Here's Video

ఘోర ప్రమాదం  

ఇక వారం క్రితం వాషింగ్టన్ విమానాశ్రయ సమీపంలో ప్రయాణికుల విమానం, మిలటరీ హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుల వ్యవధిలోనే ఇప్పుడు మరో ప్రమాదం జరగడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. కాగా తాజా ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు మాత్రమే ఉన్నట్టు ఎఫ్ఏఏ చెబుతుండగా, ఆరుగురు ఉన్నట్టు ట్రాన్స్‌ పోర్టేషన్ సెక్రటరీ సీన్ డఫీ నిర్ధారించారు. వారందరూ మరణించి ఉంటారని భావిస్తున్నారు. మృతుల సమాచారం తెలియాల్సి ఉంది. విమానం కూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి