Delhi CM Order: బస్‌స్టాపులో మహిళలు వేచి ఉన్నారు. బస్సు ఆపాలంటూ డ్రైవర్ ను కోరారు. అయితే, బస్సు ఆపని డ్రైవర్.. కేజ్రీవాల్ ఏం చేశారంటే? వీడియో ఇదిగో!

బస్టాపులో ఓ ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు.

Credits: Twitter

Newdelhi, May 19: బస్టాప్‌లో (Bus Stop) వేచి చూస్తున్న మహిళల (Women) కోసం బస్సు ఆపని డ్రైవర్‌పై (Driver) ఢిల్లీలోని (Delhi) కేజ్రీవాల్ ప్రభుత్వం (Kejriwal Government) వేటేసింది. బస్టాపులో ఓ ప్రయాణికుడు దిగేందుకు బస్సును స్లో చేసిన డ్రైవర్.. అక్కడనున్న మహిళలను ఎక్కించుకోకుండా ముందుకు కదిలించాడు. వారు బస్సు వెనక పరిగెడుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఆ డ్రైవర్‌ను గుర్తించి సస్పెండ్ చేసింది. మహిళా ప్రయాణికులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం తెలిసిందే.

Setting Up 8 New Cities Across India: భారత్‌లో 8 కొత్త నగరాల ఏర్పాటు దిశగా కేంద్రం.. ప్రస్తుతం పట్టణాలపై జనాభా ఒత్తిడి తగ్గించేందుకే..