Operation Ajay: 'ఆపరేషన్ అజయ్'లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి 212 మంది భారతీయులతో స్వదేశానికి చేరిన తొలి ఫ్లైట్.. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం.. ఫోటోలు ఇవిగో

యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్‌ లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ దిగ్విజయంగా ప్రారంభమైంది.

Operation Ajay (Credits: X)

Newdelhi, Oct 13: యుద్ధంతో (War) సంక్షోభంలో ఉన్న ఇజ్రాయెల్‌ (Israel) లో చిక్కుకున్న భారతీయులను (Indians)  సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం తలపెట్టిన ‘ఆపరేషన్ అజయ్’ (Operation Ajay) దిగ్విజయంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి 212 మంది భారతీయులతో ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన తొలి చార్టెడ్ ఫ్లైట్ శుక్రవారం ఉదయం భారత్‌ లో దిగింది. ప్రయాణికుల్లో ఓ శిశువు కూడా ఉంది. న్యూఢిల్లీ విమానాశ్రయంలో దిగిన భారతీయులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సాదర స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Global Hunger Index 2023: దేశంలో ఆకలి కేకలంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదిక.. 125 దేశాల్లో భారత్‌కు 111వ స్థానం.. భారత్ ఫైర్!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now