Pakistan: ఇవేం ధరలు బాబోయ్.. పాక్ చరిత్రలో తొలిసారిగా రూ.300 మార్కు దాటిన ఇంధన ధరలు
పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి.
Newdelhi, September 1: ధరల పెరుగుదల, విద్యుత్ చార్జీల (Electricity Charges) భారంతో ఇప్పటికే అల్లాడుతున్న పాక్ (Pak) ప్రజలను ఇంధన ధరలు కూడా పట్టి పీడిస్తున్నాయి. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్ (Petrol), డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి. పాక్ ప్రధాని అన్వరుల్ హక్ కకర్ ఆధ్వర్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం పెట్రోల్ ధర లీటరుకు రేూ.14.91, డీజిల ధర రూ.18.44 మేర పెంచింది. దీంతో, తాజా పెట్రోల్ ధర లీటరుకు రూ.305.36కు చేరుకోగా, డీజిల్ ధర రూ.311.84ను తాకింది. ఇది రికార్డ్.