Newdelhi, September 1: ఎల్ నినో (Elnino) ప్రభావంతో గత నెలలో మొహం చాటేసిన వానలు (Rains) ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్ లో ఈ వారం వానలు కురుస్తాయని ఐఎండీ (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. 'జూలైలో అధిక వర్షాల తరువాత ఆగస్టులో చాలా వరకూ రుతుపవనాలు మొహం చాటేశాయి. ఎల్‌నినో పరిస్థితులే దీనికి కారణం. అయితే, ఈ నెలలో దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 167.9 మి.మీకు 9 శాతం అటూఇటూగా ఈ నెల వానలు కురుస్తాయని అన్నారు. అధిక వర్షపాతం నమోదైనా అది జూన్-సెప్టెంబర్ కాలపు సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు.
This August was the driest and warmest for the entire country since weather records began being kept in 1901, IMD said on Thursday.
(Reports @jayashreenandi)https://t.co/VPhm7gkyb1
— Hindustan Times (@htTweets) September 1, 2023
122 ఏండ్లలో ఇదే తొలిసారి
గత నెలలో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా చినుకుపడలేదు. గడిచిన 122 ఏండ్లలో ఇదే తొలిసారి.