Pravasi Bharatiya Express: ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ, మూడు వారాల పాటు దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలను చుట్టిరానున్న ట్రైన్, వీడియో ఇదిగో..

విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలు(Pravasi Bharatiya Express)ను నేడు ప్రారంభించింది. భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా ఈ రైలును వ‌ర్చువ‌ల్‌గా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు

PM Narendra Modi Virtually Flags off Pravasi Bharatiya Express (Photo Credits: X/ANI)

విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వాసీ భార‌తీయ ఎక్స్‌ప్రెస్ రైలు(Pravasi Bharatiya Express)ను నేడు ప్రారంభించింది. భువ‌నేశ్వ‌ర్‌లో జ‌రుగుతున్న 18వ ప్ర‌వాసీ భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా ఈ రైలును వ‌ర్చువ‌ల్‌గా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎన్ఆర్ఐ టూరిస్టుల కోసం ఈ రైలును స్టార్ట్ చేశారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ రైల్వే స్టేష‌న్ నుంచి ఈ రైలు బ‌య‌లుదేరి.. దేశంలోని ప‌లు సంప్ర‌దాయ‌, మ‌త‌ప‌ర‌మైన ప్ర‌దేశాల‌ను మూడు వారాల పాటు చుట్టి రానుంది. విదేశాల్లో ఉన్న భార‌తీయుల కోసం ఈ టూరిస్టు రైలు కాన్సెప్ట్‌ను డెవ‌ల‌ప్ చేశారు. 45 ఏండ్ల నుంచి 65 ఏండ్ల మ‌ధ్య ఉన్న‌వారు ఈ రైలులో ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.

రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోదీ, తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన భారత ప్రధాని

ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరిన ఈ రైలు.. ఆ త‌ర్వాత అయోధ్య అక్క‌డ నుంచి పాట్నా, గ‌యా, వారణాసి, మ‌హాబ‌లిపురం, రామేశ్వ‌రం, మ‌ధురై, కొచ్చి, గోవా, ఎక్తా న‌గ‌ర్‌(కేవ‌డియా), అజ్మీర్‌, పుష్క‌ర్‌, ఆగ్రా ప‌ట్ట‌ణాల‌ను చుట్టువ‌స్తుంది. ఈ రైలులో 156 మంది ప్ర‌యాణికులు ప్రయాణం చేయవచ్చు. రైలు టూరుకు చెందిన అన్ని ఖ‌ర్చుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది. ఆయా దేశాల నుంచి ఇండియాకు వ‌చ్చే ప్ర‌వాసీల రిట‌ర్న్ విమాన ఖ‌ర్చులో 90 శాతం కూడా ప్ర‌భుత్వ‌మే పెట్టుకోనుంది.ప్ర‌యాణికులు కేవ‌లం 10 శాతం ఛార్జీ మాత్ర‌మే చెల్లించాల్సి ఉంటుంది. ఈ రైలులో టూర్ చేసే వారికి 4స్టార్ హోట‌ల్ అకామిడేష‌న్ ఇవ్వ‌నున్నారు.

PM Modi Virtually Flags Off Pravasi Bharatiya Express

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement