Amritsar Horror: ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా మంచానికి కట్టేసి నిప్పంటించి చంపేసిన భర్త.. పంజాబ్ లో దారుణం

పంజాబ్‌ లోని అమృత్‌ సర్‌ లో దారుణం జరిగింది. కడుపులో కవలలతో ఉన్న ఆరు నెలల గర్భవతిని మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో కర్కశ భర్త.

Amritsar Horror -Pinky (Credits: X)

Amritsar, Apr 21: పంజాబ్‌ (Punjab) లోని అమృత్‌ సర్‌ లో (Amritsar) దారుణం జరిగింది. కడుపులో కవలలతో (Twins) ఉన్న ఆరు నెలల గర్భవతిని మంచానికి కట్టేసి కాల్చి చంపేశాడో కర్కశ భర్త. అసలేం జరిగిందంటే.. అమృత్‌ సర్‌ కు సమీపంలోని బుల్లెనంగల్‌ కు చెందిన పింకీ, సుఖ్‌ దేవ్‌ భార్యాభర్తలు. అయితే, దంపతుల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. శుక్రవారం రాత్రి కూడా వాగ్వాదం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు మాటలు అనుకోవడంతో.. కోపోద్రిక్తుడైన సుఖ్‌ దేవ్‌ ఆరు నెలల గర్భవతి అనికూడా చూడకుండా పింకీని మంచానికి కట్టేశాడు. ఆవేశంలో ఆమెకు నిప్పంచడంతో సజీవ దహనమయింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పింకీ కడుపులో కవలలు ఉన్నట్టు వైద్య పరీక్షల్లో తేలింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement