Wake Up Call: పిల్లలకు బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి.. వాళ్ళను ఉదయాన్నే లేపండి.. ఆలయాలు, మసీదులను కోరిన హర్యానా ప్రభుత్వం
పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతా శాతాన్ని పెంచాలని నిర్ణయించుకున్న హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యార్థులు త్వరగా లేచి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూడాలంటూ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలను కోరింది. మైకుల ద్వారా వారిని తెల్లవారుజామునే నిద్రలేపాలని కోరింది.
Chandigarh, Dec 26: పరీక్షల్లో (Exams) విద్యార్థులు (Students) ఉత్తీర్ణతా శాతాన్ని (Pass Percentage) పెంచాలని నిర్ణయించుకున్న హర్యానా ప్రభుత్వం (Haryana Government) కీలక ప్రకటన చేసింది. బోర్డు ఎగ్జామ్స్ (Board Exams) దగ్గర పడుతున్న నేపథ్యంలో 10, 12వ తరగతి విద్యార్థులు త్వరగా లేచి పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూడాలంటూ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలను కోరింది. మైకుల ద్వారా వారిని తెల్లవారుజామునే నిద్రలేపాలని కోరింది.
అంతేకాదు, పిల్లలను 4.30 గంటలకు నిద్రలేపి పరీక్షలకు సన్నద్ధం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులను విద్యాశాఖ కోరింది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి జాయింట్ ప్లాన్ రూపొందించుకోవాలని, సెల్ఫ్ స్టడీ కోసం ప్రత్యేక గంటలు కేటాయించేలా చూడాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)