Viral Video: కాలువ లో కొట్టుకుపోతున్న యువతిని కాపాడిన వీర సైనికుడు.. పంజాబ్ పాటియాలాలో ఘటన.. వీడియో ఇదిగో!

కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా అందులోకి దూకి అమ్మాయిని రక్షించారు. పంజాబ్ లోని పాటియాలాలో ఆదివారం జరిగిందీ ఘటన.

Credits: Twitter

Newdelhi, June 19: ప్రమాదవశాత్తు కాలువలో (Canal) పడి కొట్టుకుపోతున్న ఓ యువతిని (Girl) ఆర్మీ జవాను (Soldier) ప్రాణాలకు తెగించి కాపాడారు. కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తున్నా లెక్క చేయకుండా అందులోకి దూకి అమ్మాయిని రక్షించారు. పంజాబ్ లోని పాటియాలాలో ఆదివారం జరిగిందీ ఘటన. పాటియాలాలోని భాక్రా కెనాల్ ఎప్పుడూ ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. అయితే ఓ యువతి ప్రమాదవశాత్తు ఆ కాలువలో పడి కొట్టుకుపోసాగింది. ఆమెను గమనించిన జవాన్‌ డీఎన్‌ క్రిష్ణన్‌.. వెంటనే నీటిలోకి దూకేశారు. యువతిని పట్టుకుని బయటికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో సాధ్యపడలేదు. స్థానికులు గమనించి బయటి నుంచి జవానుకు తాళ్లు అందించారు. వాటి సాయంతో యువతిని జవాను ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)