Uttar Pradesh: వైరల్ వీడియో, విద్యార్థులు తన్నుకుంటుండగా వేగంగా వచ్చి ఇద్దరినీ ఢీకొట్టిన కారు, అయినా గొడవను ఆపని విద్యార్థులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లాలో నడి రోడ‍్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు.

Speeding Car Plows Through Youths Fighting in Ghaziabad (Photo-Video Grab)

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌ జిల్లాలో నడి రోడ‍్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి.కాగా పోలీసులు ఎంట‍్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్‌ స్టేషన్‌ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement