Tamil Nadu Bus Viral: ఇదేందయ్యా.. ఇది..?? కదులుతున్న బస్సు నుంచి అకస్మాత్తుగా ఊడిపోయిన వెనక చక్రాలు.. తమిళనాడులో ఘటన

కదులుతున్న బస్సు నుంచి వెనక టైర్లు అకస్మాత్తుగా విడిపోయిన అసాధారణ ఘటన తమిళనాడులో తాజాగా చోటుచేసుకుంది.

Tamil Nadu Bus Tyres (Credits: X)

Chennai, Dec 17: కదులుతున్న బస్సు (Bus) నుంచి వెనక టైర్లు (Tyres) అకస్మాత్తుగా విడిపోయిన అసాధారణ ఘటన తమిళనాడులో (Tamilnadu) తాజాగా చోటుచేసుకుంది. సేలం సెంట్రల్ బస్టాండ్ నుంచి ఓ ప్రైవేటు బస్సు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే, వెల్లాండి ప్రాంతంలో వెళుతుండగా బస్సు ముందు టైరు అకస్మాత్తుగా పేలింది. అదే సమయంలో వెనక టైర్లు రెండూ విడిపోయాయి. దీంతో, వాహనం వెనక భాగం నేలకు తాకడంతో బస్సు పెద్ద శబ్దం చేస్తూ కొంతదూరం వెళ్లింది. ఈలోపు డ్రైవర్ అప్రమత్తమైన బస్సును ఆపేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

Tamil Nadu Bus Tyres (Credits: X)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now