Cyber Crime Alert: వీడియో ఇదిగో, రోడ్డు మీద రూ.500 నోటు ఉన్న పర్సు, ఆశతో తీసుకుందామని వంగారో అంతే సంగతులు, శభాష్ అనిపిస్తున్న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల వినూత్న ప్రచారం

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో రూ.500 నోటు ఉన్న పర్సును రోడ్డుపై వేయగా.. ప్రజలు పర్సు అనుకుని తెరిచి చూస్తే సైబర్ నేరాలపై 1930కు కాల్ చేయాలని సమాచారం ఉంటుంది

Telangana Police Innovative police campaign against cyber Crime

సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్న వీడియోల్లో రూ.500 నోటు ఉన్న పర్సును రోడ్డుపై వేయగా.. ప్రజలు పర్సు అనుకుని తెరిచి చూస్తే సైబర్ నేరాలపై 1930కు కాల్ చేయాలని సమాచారం ఉంటుంది. అసలుకు, నకిలీకి మధ్య తేడాలు గుర్తించాలని, ఆశపడకుండా అప్రమత్తంగా ఉండాలనే సందేశం అందులో ఉంటుంది.

అచ్చం ఈ పర్సు లాగానే ఆన్‌లైన్ మోసాలు కూడా ఉంటాయని.. ఆశపడి అలాంటి మాయల్లో చిక్కుకుని మోసపోవద్దని ప్రజలకు ఈ బ్రోచర్ ద్వారా సైబర్ క్రైం పోలీసులు తెలియజేస్తున్నారు.1930పై ప్రజలకు మరింత అవగాహన కల్పించటంలో భాగంగానే.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

సైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌తో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో తెలంగాణ స్టేట్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ కొనసాగుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో.. 30 మంది సిబ్బందితో 24/7 ఈ కాల్‌సెంటర్‌ పనిచేస్తోంది. ఈ సెంటర్‌కు వచ్చే కాల్స్‌ను మేనేజ్‌ చేసేందుకు ఎక్సోటెల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా టోల్‌ఫ్రీ నంబర్‌కు వచ్చే కాల్స్‌ నేరుగా అక్కడ పనిచేసే సిబ్బందికి వెళ్తుంటాయి.

Telangana Police Innovative police campaign against cyber Crime

Here's Cyberabad Police Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)