Congenital Heart Diseases: దేశంలో 2 లక్షల మంది పిల్లలకు గుండె జబ్బులు.. పుట్టుకతో వచ్చినా చికిత్సకు అవకాశం
అయితే పుట్టుకతో గుండె జబ్బులు ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Newdelhi, Feb 18: దేశంలో ఏటా రెండు లక్షల మంది గుండె సంబంధిత జబ్బులతో (Congenital Heart Diseases) పుడుతున్నారు. అయితే పుట్టుకతో గుండె జబ్బులు (Heart Attacks) ప్రాణాంతకం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా అలాంటి జబ్బులను వెంటనే గుర్తించి పిల్లలకు చికిత్స చేయవచ్చని ఢిల్లీలోని సీకే బిర్లా ఆసుపత్రి కార్డియాలజీ విభాగం కన్సల్టెంట్ సంజీవ్ కుమార్ గుప్తా అన్నారు. అయితే పుట్టుకతో వచ్చే గుండె జబ్బులను గుర్తుపట్టలేనంత లక్షణ రహితంగా ఉంటాయని చెప్పారు. ఈ గుండె లోపాలు ఊపిరితిత్తుల ద్వారా అసాధారణ రక్త ప్రవాహానికి కారణమవుతాయని, వేగంగా శ్వాస తీసుకోవడం, బరువు పెరగడం, చర్మం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలు మాత్రం కనిపిస్తాయని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)