Uttar pradesh: డాక్టర్‌పై చేయి చేసుకున్న నర్సు, తిరిగి నర్సుపై చేయి చేసుకున్న డాక్టర్, అసభ్య పదజాలంతో దూషించుకున్న ఇరువురు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

యూపీలో ఓ డాక్టర్‌, నర్సు ఆస్పత్రిలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ప్రకారం... వైద్యుడికి వద్దకు వచ్చిన నర్సు ఏదో విషయమై ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు.

Doctor and Nurse at UP Hospital Get Into Ugly Fight (Photo-Video Grab)

యూపీలో ఓ డాక్టర్‌, నర్సు ఆస్పత్రిలో ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ప్రకారం... వైద్యుడికి వద్దకు వచ్చిన నర్సు ఏదో విషయమై ఆయనను నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు వారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో విచక్షణ కోల్పోయిన సదరు నర్సు.. డాక్టర్‌పై చేయిచేసుకున్నారు.

ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న డాక్టర్‌ సైతం వెంటనే స్పందించి, ఆమెను తిరిగి కొట్టారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై నగర మెజిస్ట్రేట్‌ రాంజీ మిశ్రా ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘వారిద్దరితోనూ మాట్లాడాను. తీవ్రమైన ఒత్తిడి, అధిక పనిభారం వల్లే ఇలా చేసినట్లు చెప్పారు. ఏదేమైనా ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తాం’’ అని పేర్కొన్నారు. ఓ పేషెంట్‌కు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement