Uttar Pradesh: నేరుగా క్లాస్ రూంలోకి వచ్చిన చిరుతపులి, పదేళ్ల బాలుడిపై దాడి, భయంతో పరుగులు పెట్టిన మిగతా విద్యార్థులు
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో టీచర్ పాఠం చెప్తుండగా ఓ చిరుత సైలెంట్‌గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. అక్కడ చౌదరీ నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లో ఈ ఘటన జరిగింది. చిరుత దాడి గురించి తెలిసిన ఇతర విద్యార్థులంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో కాలేజ్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో టీచర్ పాఠం చెప్తుండగా ఓ చిరుత సైలెంట్‌గా తరగతి గదిలోకి వచ్చింది. క్లాస్ వింటున్న ఒక పదేళ్ల బాలుడిపై దాడి చేసింది. అక్కడ చౌదరీ నిహాల్ సింగ్ ఇంటర్ కాలేజ్‌లో ఈ ఘటన జరిగింది. చిరుత దాడి గురించి తెలిసిన ఇతర విద్యార్థులంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెత్తారు. దీంతో కాలేజ్ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. దీనిలో కొందరు గాయపడ్డారు కూడా. చిరుత దాడి చేసిన విద్యార్థి కూడా తప్పించుకున్నాడు. అతనికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించారు.అతనికి ప్రాణాపాయం ఏమీ లేదని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్కూలు యాజమాన్యం వెంటనే ఫారెస్టు అధికారులకు, పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)