Uttarakhand: వైరల్ వీడియో, ఒక్కసారిగా రోడ్డు మీద విరిగిపడిన కొండ చరియలు, భయంతో పరుగులు పెట్టిన వాహనదారులు

జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. దీంతో రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి

Landslide (Representational Image|ANI)

భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌, ప్రయాగ్‌రాజ్‌లోని తర్సాలి గ్రామ సమీపంలో గురువారం ఉదయం ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. జాతీయ రహదారి 109 పూర్తిగా మూసుకుపోయింది. దీంతో రెండు వైపుల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరించటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కొండచరియలు విరిగిపడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.జాతీయ రహదారిపై పడిన శిథిలాలను తొలగించి వాహన రాకపోకలను త్వరలోనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్‌ మయూర్‌ దీక్షిత్‌ తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)