Wayanad landslides: Over 80 bodies recovered as rescue operations underway

Wayanad, August 9: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన ప్రకృతి విలయం తీవ్ర నష్టం కలిగించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 413 మంది మరణించగా, ఇంకా 152 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. అయితే కేరళలోని కొండచరియలు విరిగిపడిన వాయనాడ్ జిల్లాలోని ఎడక్కల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భూమి లోంచి వింత శబ్దాలు వస్తున్నాయని చెబుతున్నారు.

వయనాడ్, పాలక్కాడ్, కోజికోడ్ ప్రాంతాల్లో భూమి లోంచి విచిత్రమైన ధ్వనులు వస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు.భూమి కింద నుండి ఏదో శబ్దం వినిపిస్తోందని నివాసితులలో భయాందోళనలు సృష్టించారని శుక్రవారం పలువురు ఫిర్యాదు చేశారు.ఇప్పటికే కొండచరియలు విరిగిపడిన ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న ప్రజలు... భూమి లోంచి వస్తున్న ధ్వనులతో ఇంకేం విపత్తు సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. వయనాడ్ విలయంలో 387కు పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా 180 మంది మిస్సింగ్, చలియార్ నదిలో కొట్టుకువస్తున్న మృతదేహాలు

ఈ ఉదయం 10.30 సమయంలో భూమి లోంచి శబ్దాలు రావడంతో స్కూళ్లలోని విద్యార్థులు బయటికి పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో ఇలాంటి శబ్దాలు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భూకంపం వస్తుందేమోనంటూ ప్రచారం మొదలైంది. అయితే, సెంటర్ ఫర్ సీస్మాలజీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేరళ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ శబ్దాల వల్ల ప్రమాదమేమీ లేదని, భూకంపం వస్తుందన్న భయాలు అవసరం లేదని స్పష్టం చేశాయి.

కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (కెఎస్‌డిఎంఎ) భూకంప రికార్డులను పరిశీలిస్తోందని మరియు ఏదైనా అసాధారణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక నిఘాను కూడా ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకు భూకంప రికార్డులు కదలికల సంకేతాలను చూపించడం లేదు" అని అది తెలిపింది.