PM Modi Wayanad visit updates Modi conducts aerial survey of landslide-affected areas in Wayanad (X)

Kerala, Aug 10:  ప్రకృతి సృష్టించిన బీభత్సానికి కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వందలాది మంది మృతిచెందగా ఇంకా కొంతమంది ఆచూకీ లభించలేదు. ఇక ఇవాళ కేరళలోని వరద బీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉదయం కేరళలోని కన్నూర్ అంతర్జాతీయ విమనాశ్రాయానికి చేరుకున్న ప్రధానికి సీఎం పినరయి విజయన్ ఘన స్వాగతం పలికారు.

అనంతరం వాయు సేన హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ప్రధాని వెంట సీఎం విజయన్‌తో పాటు కేంద్రమంత్రి సురేశ్‌ గోపి కూడా ఉన్నారు. అలాగే వయనాడ్‌లోని చూరల్మల, ముండక్కై గ్రామాలను సందర్శించనున్నారు మోడీ. నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సందర్శించి అనంతరం ఉన్నతాధికారులుతో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు.

Here's Video:

 అధికారికంగా ఇప్పటివరకు 225 మంది మృతి చెందారని ప్రకటించారు సీఎం విజయన్. వివిధ ప్రాంతాల్లో మొత్తం 195 మృతదేహాలు లభ్యమయ్యాయని, మృతదేహాలకు సంబంధించి డీఎన్‌ఏ శాంపిల్స్ వైద్య పరీక్షల కోసం పంపామన్నారు. 178 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పారు. మిగిలిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు. ఇక వయనాడ్‌లో 10 రోజుల సహాయక చర్యలు పూర్తి కావడంతో భారత సైన్యం తిరిగి వెళ్లిపోయింది. వయనాడ్ బాధితుల కోసం హీరో ప్రభాస్ ఆపన్నహస్తం.. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.2 కోట్ల విరాళం 

Here's Video:

వయనాడ్ ఘటనపై తొమ్మిది మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వయనాడ్ విపత్తులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

Here's Tweet: