
Hyderabad, Aug 7: వయనాడ్ (Wayanad) జిల్లాలో ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన బాధితులకు సినీ నటుడు ప్రభాస్ (Hero Prabhas) భారీ విరాళం ప్రకటించి ఆపన్న హస్తం అందించారు. బాధితుల అవసరార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. జులై 30న కురిసిన కుంభవృష్ఠితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గ్రామాలు కొట్టుకుపోయాయి. కాగా, వయనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు.
సాయంలో వీరు సైతం
వయనాడ్ బాధితులకు విరాళాలు అందించిన సినీ నటుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు ఉన్నారు.