Vadodara Rains: షాకింగ్ వీడియోలు ఇవిగో, భారీ వరదలకు ఇళ్లల్లోకి వచ్చిన భారీ మొసళ్లు, భయంతో పరుగులు పెడుతున్న ప్రజలు, గుజరాత్‌లో వరదలు బీభత్సం
గడిచిన మూడు రోజుల్లోనే 28 మంది వరదలతో మృతిచెందారు. వరసగా నాలుగోరోజైన బుధవారం వర్షాల తీవ్రత తగ్గలేదు. దేవ్‌భూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియాలో 24 గంటల్లో 454 మి.మీ, జామ్‌నగర్‌లో 387 మి.మీ, అత్యధిక తాలూకాల్లో 200 మి.మీ.పైగా వర్షం కురిసింది.
గుజరాత్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే 28 మంది వరదలతో మృతిచెందారు. వరసగా నాలుగోరోజైన బుధవారం వర్షాల తీవ్రత తగ్గలేదు. దేవ్‌భూమి ద్వారకా జిల్లాలోని ఖంభాలియాలో 24 గంటల్లో 454 మి.మీ, జామ్‌నగర్‌లో 387 మి.మీ, అత్యధిక తాలూకాల్లో 200 మి.మీ.పైగా వర్షం కురిసింది. గురువారం సైతం భారీవర్షాలు కొనసాగనున్నాయి. 17,800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 'ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్' జోన్‌గా గుజరాత్, భారీ వర్షాలతో ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్, గంగానది ఉగ్రరూపం, ఆగస్టు 31 వరకు స్కూళ్లకు సెలవు
ఇళ్ల పైకప్పులపైకి చేరుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నవారిని ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, భారత వైమానిక దళం, భారత తీరగస్తీ దళాల సాయంతో రక్షిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్రం అండగా ఉంటుందని హామీనిచ్చారు. గుజరాత్‌లోని నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. రోడ్లు, రైలుమార్గాలు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు రైళ్లు రద్దయ్యాయి.ఇక భారీ వరదలకు జనావాసాల్లోకి మొసళ్లు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)