Madhya Pradesh Shocker: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని తోపుడు బండిపై ఆసుపత్రికి తరలించిన బాలుడు.. వీడియో ఇదిగో!
అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఆరేళ్ల కుర్రాడు పడ్డ అవస్థ చూస్తే కళ్లు చెమర్చక మానవు.
Bhopal, Feb 12: అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఆసుపత్రికి (Hospital) ఆటోలో (Auto) తీసుకెళ్లేందుకు ఆ ఆరేళ్ల బాలుడి (6 years old Boy) వద్ద డబ్బుల్లేవు. దీంతో చివరకు తోపుడు బండిని ఆశ్రయించాడు. తల్లితో కలిసి తండ్రిని తోపుడు బండిపై పడుకోబెట్టి తోసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీలో చోటుచేసుకున్న ఈ ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. అంబులెన్స్ సౌకర్యం లేకపోవడంతోనే బాలుడు తోపుడు బండిని ఆశ్రయించినట్టు తెలుస్తుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)