Donkey Gets Baby Shower: వీడియో ఇదిగో..గాడిదలకు శ్రీమంతం చేసిన గుజరాత్ వాసులు, నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పిన మహిళలు, కారణం ఏంటో తెలుసా 

గుజరాత్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్కడ హలరీ జాతి గాడిదలు అంతరించిపోయే జాబితాలో ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు రాజ్ కోట్ ప్రజలు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు.

donkey gets baby shower (Photo-Video Grab)

గుజరాత్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అక్కడ హలరీ జాతి గాడిదలు అంతరించిపోయే జాబితాలో ఉండటంతో వాటిని కాపాడుకునేందుకు రాజ్ కోట్ ప్రజలు కృషి చేస్తున్నారు. వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అందుకే పిల్లలు పుట్టినప్పుడు ఎలా శుభకార్యాలు చేస్తారో.. అప్పుడే పుట్టిన గాడిద పిల్లలకు అలానే చేస్తున్నారు. బారసాల నిర్వహిస్తున్నారు. గర్భం దాల్చిన వాటికి సీమంతం చేస్తున్నారు.

కొన్ని రోజుల కిందట ఉప్లేటా తాలూకాలోని కోల్కి అనే గ్రామంలో హలరీ జాతి గాడిద ఈనింది. దీంతో గ్రామవాసులు సంబరాలు చేసుకున్నారు. పశువుల కాపరులు, ఇతరులు కలిసి బారసాల చేశారు. గర్భం దాల్చిన మరో 33 గాడిదలకు సీమంతం కూడా చేశారు. నుదుటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజలు చేసి, ఆహారం పెట్టారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు మిఠాయిలు పంచుకున్నారు. ప్రస్తుతం హలరీ జాతి గాడిదలు 417 మాత్రమే ఉన్నాయట.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement