IIT Baba Apologizes Video: వీడియో ఇదిగో, ఇండియా గెలుస్తుందని నా మనసుకు తెలుసు అంటూ మాటమార్చిన ఐఐటీ బాబా, క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్
చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌ను పాతరేస్తూ టీమ్‌ఇండియా విజయపతాకాన్ని ఎగురవేసిన సంగతి విదితమే. ఆల్‌రౌండ్ షో తో పాక్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ గెలవదంటూ ఐఐటీ బాబా అభయ్ సింగ్ (IIT Baba) జోష్యం చెప్పిన విషయం తెలిసిందే.దీంతో ఈ ఐఐటీ బాబాపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇలా జోష్యం చెప్పడం మానేయాలంటూ ఐఐటీ బాబాకు క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఐఐటీ బాబా స్పందించారు. ఈ మేరకు క్షమాపణలు చెబుతూ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు షేర్ చేశారు. ‘నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్టీ టైం. కాబట్టి ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకోవాలి. భారత్ గెలవదని చెప్పాను కానీ, గెలుస్తుందని నా మనసుకు తెలుసు’ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు విరాట్ కోహ్లీ, టీమిండియా సంబరాలు చేసుకుంటున్న ఫొటోలను జోడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
IIT Baba Apologizes