Viral Video: ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడూ చూడలే.. పాకిస్థాన్ వీధుల్లో ట్రంప్ కుల్ఫీ అమ్మడమేంటి? అసలేంటి సంగతి?? (వీడియో)
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను పోలిన ఒక వ్యక్తి (Man Resembling Donald Trump ) పాకిస్థాన్ లో ఉన్నాడు. అతడు ఎంచక్కా పాటలు పాడుతూ కుల్ఫీ అమ్ముతున్నాడు.
Newdelhi, Oct 10: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను పోలిన ఒక వ్యక్తి (Man Resembling Donald Trump) పాకిస్థాన్ (Pakistan) లో ఉన్నాడు. అతడు ఎంచక్కా పాటలు పాడుతూ కుల్ఫీ అమ్ముతున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాకిస్థాన్ పంజాబ్ లోని సాహివాల్ జిల్లాకు చెందిన కుల్ఫీలు అమ్మే వ్యక్తికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముఖ పోలికలు ఉన్నాయి. స్థానికులు అతడ్ని ‘చాచా బగ్గా’ అని పిలుస్తారు. ప్రముఖ గాయకుడి మాదిరిగా అతడు పాటలు పాడుతుంటాడు. ‘ఆయే కుల్ఫీ… కుల్ఫీ! ఆ… ఖోవో కుల్ఫీ, కుల్ఫీ, కుల్ఫీ’ అంటూ పాటలు పాడతాడు. కుల్ఫీ అమ్మేందుకు ఆ వీధుల్లోకి తాను వచ్చినట్లు తన పాటల ద్వారా స్థానికులకు తెలియజేస్తుంటాడు. 2021లో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)