Viral Video: ఇదేం కాపీరా బాబు... విగ్గు కింద చిప్, బ్లూటూత్‌లు పెట్టుకుని ప్రభుత్వ పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
యూపీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గత వారం యూపీలో సబ్‌ఇన్స్‌పెక్టర్ మెయిన్స్ రాతపరీక్షలు జరుగాయి. దీనిలో ఒక అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వచ్చాడు.అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ప్రత్యేక అధికారులు అతడిని బయటకు తీసుకెళ్లి తనిఖీ చేశారు. ఆ యువకుడిని పూర్తిగా పరిశీలించారు. ఎక్కడ కూడా.. ఎలాంటి కాపీయంగ్ ఆనవాళ్లు దొరకలేదు. చివరకు వారు.. అతగాడి తలపైన తనిఖీ చేశారు. అతడి జుట్టును పక్కకు జరిపి చూశారు. యువకుడి తలపైన ఒక విగ్ మాదిరిగా వెంట్రుకలు ఉన్నాయి.
దానికింద ప్రత్యేక చిప్, బ్లూటూత్‌లు ఉన్నాయి. దీన్ని చూసిన అధికారులు ఖంగుతిన్నారు. ఆ తర్వాత.. యువకుడిని పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపించేశారు. అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ హైటెక్ మాస్‌కాపీయంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎస్ అధికారి రూపిన్‌శర్మ తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.