Burqa for Free Bus Service: ఉచిత బస్సు ప్రయాణం కోసం బుర్ఖా ధరించిన హిందూ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైంది? వీడియోతో
ఈ స్కీమ్ కోసం కొందరు తాపత్రేయపడుతూ బుక్ అయ్యే విచిత్ర వైరల్ ఉదంతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో ఉచిత ప్రయాణం కోసం బుర్ఖా ధరించాడన్న వార్త వైరల్‌గా మారింది.
Bengaluru, July 7: కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని (Free Bus Scheme) తీసుకురావడం తెలిసిందే. ఈ స్కీమ్ కోసం కొందరు తాపత్రేయపడుతూ బుక్ అయ్యే విచిత్ర వైరల్ (Viral) ఉదంతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ హిందూ వ్యక్తి బస్సులో (Bus) ఉచిత ప్రయాణం కోసం బుర్ఖా ధరించాడన్న వార్త వైరల్‌గా మారింది. బస్టాప్‌లో (Bus stop) బుర్ఖా ధరించి కూర్చున్న వీరభద్రయ్య మఠాపతిని చూసిన కొందరికి అనుమానం కలిగింది. వారు అతడిని ప్రశ్నించగా తాను భిక్షాటన కోసం బుర్ఖా ధరించినట్టు చెప్పుకొచ్చారు. అతడి వద్ద మహిళ ఫొటో ఉన్న ఆధార్ కార్డు కూడా లభించడంతో సందేహాలు మరింత బలపడ్డాయి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)