Video:షాకింగ్ వీడియో, స్పీడుగా వస్తూ కారుపై బోల్తాపడిన 18 చక్రాల భారీ ట్రక్‌, ముగ్గురు అక్కడికక్కడే మృతి, పంజాబ్ రాష్ట్రంలో ఘటన

పంజాబ్‌లోని బెహ్రామ్‌ వద్ద ఓ భారీ ట్రక్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో కారు దారుణంగా ధ్యంసంమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.

Accident Representative image (Image: File Pic)

పంజాబ్‌లోని బెహ్రామ్‌ వద్ద ఓ భారీ ట్రక్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో కారు దారుణంగా ధ్యంసంమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 18 చక్రాల భారీ ట్రక్‌ మితిమీరిన వేగంతో రహదారిపై వస్తూ.. అకస్మాత్తుగా మలుపు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్‌ కోల్పోయి బోల్తా పడింది. అదే సమయంలో ఆ రహదారిపై రెండు వాహనాలు వస్తున్నాయి.

ఐతే ఒక కారు కొద్దిలో తప్పించుకుంటే మరో వాహానం ఈ ట్రక్‌ కింద పడి నుజ్జునుజ్జు అయిపోయిది. ఈ ప్రమాదంలో ఒక జంట వారి కొడుకు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న​ సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చేసింది.పోలీసులు తన ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఈ ప్రమాదానికి కారకుడైన ట్రక్‌ డ్రైవర్‌ మేజర్‌సింగ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement