Uttar Pradesh: షాకింగ్ వీడియో, రైల్వే స్టేషన్‌లో మహిళ పక్కన నిద్రిస్తున్న పసిబిడ్డను ఎత్తుకెళ్లిన దొంగ, నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలు రంగంలోకి..
ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న మహిళ పక్కన ఉన్న పసి బిడ్డను ఒక వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు.ఈ వీడియోని అక్కడి పోలీస్ అధికారి ట్వీట్ చేయడంతో వైరల్ అయింది.
ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న మహిళ పక్కన ఉన్న పసి బిడ్డను ఒక వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు.ఈ వీడియోని అక్కడి పోలీస్ అధికారి ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అక్కడి రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్‌పై కొందరు నిద్రపోతున్నారు. వెనక్కి వచ్చి ఒక మహిళ పక్కన నిద్రపోతున్న ఏడు నెలల పాపను ఓ వ్యక్తి అపహరించి ఆ ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైలులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
పసి పాప కనిపించకపోవడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. తల్లి పక్కన నిద్రిస్తున్న పసి పాపను ఒక వ్యక్తి అపహరించి పారిపోతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి.దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)