Azmatullah Omarzai Six Video: వీడియోలు ఇవిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన అజ్మతుల్లా ఒమర్జాయి, సిక్స్ కొడితే బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో..
బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆ తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో మళ్లీ నిలబడిన చోటు నుంచి సిక్స్ బాదాడు ఒమర్జాయి. ఈసారి షార్ట్ డెలివరీని గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు పంపాడు. ఇక వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేశారు.
చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌కు చేరాలంటే కీలకంగా మారిన మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు పోరాడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాకు 274 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఆఖర్లో ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయి (67) దుమ్మురేపారు. ఏకంగా 5 సిక్సులతో ఆస్ట్రేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. అతడు కొట్టిన సిక్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో అంపైర్ తల మీదుగా అద్భుతమైన సిక్స్ కొట్టాడు ఒమర్జాయి.
బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆ తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో మళ్లీ నిలబడిన చోటు నుంచి సిక్స్ బాదాడు ఒమర్జాయి. ఈసారి షార్ట్ డెలివరీని గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు పంపాడు. ఇక వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేశారు. పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. మ్యాచ్ రద్దు అయ్యే సమయానికి 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 100/1 చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్ (55), స్టీవ్ స్మిత్ (16) ఉన్నారు. అజ్మతుల్లా బౌలింగ్‌లో గుల్బాదిన్ నైబ్‌కు క్యాచ్ ఇచ్చి మాథ్యూ షార్ట్ మొదటి వికెట్ గా వెనుదిరిగాడు.
Azmatullah Omarzai Six Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)