Sourav Ganguly Covid: రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నాక సౌరవ్‌ గంగూలీకి కరోనా, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ వర్గాలు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కాగా గంగూలీ రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు.

Sourav Ganguly (Photo Credits: Getty Images)

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కోవిడ్‌-19 నిర్దారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు సమాచారం అందించినట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. కాగా గంగూలీ రెండో డోస్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన కరోనా బారిన పడటం గమనార్హం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత రాత్రి వుడ్‌లాండ్స్‌ నర్సింగ్‌హోంలో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది’’ అని పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది ఇప్పటికే గంగూలీ రెండుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆంజియోప్లాస్టి నిర్వహించిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొన్నిరోజుల పాటు గంగూలీ ఆస్పత్రిలో ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement