India vs Australia Semi-Final: వరుసగా 14వసారి టాస్‌ ఓడిపోయిన భారత్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ కూప‌ర్ కొన‌ల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు.

India Lose 14th Consecutive Toss in ODIs

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీస్‌ ప్రారంభమైంది. టాస్‌ నెగ్గిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత్‌ వరుసగా 14వసారి టాస్‌ను కోల్పోవడం గమనార్హం. ఆస్ట్రేలియా ఫ‌స్ట్ వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ కూప‌ర్ కొన‌ల్లీ తొలి వికెట్ గా ఔట్ అయ్యాడు. ష‌మీ బౌలింగ్‌లో కూప‌ర్ డ‌కౌట్ అయ్యాడు. చాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy) సెమీఫైన‌ల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. అయితే స్లో పిచ్‌పై ఆసీస్ ఓపెన‌ర్లు ప‌రుగులు రాబ‌ట్ట‌డంలో ఇబ్బందిప‌డుతున్నారు. స్క్వేర్ డ్రైవ్ ఆడ‌బోయిన కూన‌ర్‌.. కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ ఓవ‌ర్‌లో ట్రావిస్ హెడ్ ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నాడు. హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను ష‌మీ జార‌విడిచాడు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీ సెమీఫైన‌ల్స్‌లో తిరుగులేని భారత్, ఈ సారి కొరకరాని కొయ్యగా మారిన ఆస్ట్రేలియా, గత పరాభవాలకు కసి తీర్చుకుంటుందా..

భార‌త జ‌ట్టు న‌లుగురు స్పిన్న‌ర్ల‌తో ఆడుతోంది. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్‌, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్‌.. స్పిన్న‌ర్ల జాబితాలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా కూడా రెండు భారీ మార్పులు చేసింది. ఆడ‌మ్ జంపా, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ట్రావిస్ హెడ్‌తో పాటు కూప‌ర్ కాన‌ల్లే, త‌న్వీర్ సంఘా స్పిన్ బౌల‌ర్ పాత్ర పోషించ‌నున్నారు.

IND vs AUS LIVE score Champions trophy 2025:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement