India Qualifies for WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్, జూన్‌ 7 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌

డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్‌ నీళ్లు చల్లింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్‌ సెంచరీ సాధించిన కేన్‌ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు.

New-Zealand-

డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్‌కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్‌ నీళ్లు చల్లింది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో అజేయమైన సూపర్‌ సెంచరీ సాధించిన కేన్‌ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకున్నాడు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కేన్‌ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్‌ చేసి, తన జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

తొలి టెస్ట్‌లోనే లంక ఓటమిపాలుకావడంతో ఆసీస్‌తో నాలుగో టెస్ట్‌ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్‌కు చేరింది. ఈ ఏడాది జూన్‌ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానం వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది.

Heres' Update

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement