ICC Women's U19 T20 World Cup 2023: ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ వుమెన్స్ ,సెమీ ఫైనల్లో 8 వికెట్ల తేడాతో న్యూజీలాండ్ వుమెన్స్‌పై ఘన విజయం
శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది
ఐసీసీ అండర్-19 మహిళల టి20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం న్యూజిలాండ్ వుమెన్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసింది.
ఓపెనర్ షెఫాలీ వర్మ(10) విఫలమైనప్పటికి మరో ఓపెనర్ స్వేతా సెహ్రావత్(45 బంతుల్లో 61 పరుగులు నాటౌట్), సౌమ్య తివారీ(22 పరుగులు) రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్లిమ్మర్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసాబెల్లా గేజ్ 26 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పరశ్వీ చోప్రా మూడు వికెట్లు తీయగా.. తిటాస్ సాదు, మన్నత్ కశ్యప్, షఫాలీ వర్మ, అర్జనా దేవీలు తలా ఒక వికెట్ తీశారు.
Here's BCCI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)