IPL 2022: కోహ్లీ అవుట్, ఎగిరి గంతేసిన యజువేంద్ర చహల్‌ భార్య, కసి ఆ విధంగా తీర్చుకున్నారా అంటూ నెటిజన్ల ట్వీట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... . అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే.

Dhanashree Verma's Reaction When Yuzvendra Chahal Takes RCB Wicket (Photo-Twitter/Video Grab)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... . అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే. తొమ్మిదో ఓవర్‌లో యజువేంద్ర చహల్‌ విల్లేకు బంతిని సంధించగా.. రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ పాదరసంలా కదిలి బాల్‌ను చహల్‌ వైపునకు వేశాడు. వెంటనే బంతిని అందుకున్న చహల్‌ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాడు.

ఈ క్రమంలో చహల్‌ భార్య ధనశ్రీ వర్మ సెలబ్రేషన్స్‌ (Dhanashree Verma's Reaction) చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పట్టరాని సంతోషంతో ధనశ్రీ ఎగిరి గంతేసిన విధానం చూసి.. ‘‘అయ్యో.. చహల్‌ను రిటైన్‌ చేసుకోలేదని ఆర్సీబీపై అంతగా పగబట్టారా వదినమ్మా? కోహ్లి అవుట్‌ అయితే మరీ ఇంత ఆనందమా? లేదంటే ఆర్సీబీ వికెట్లు పడగొడుతున్నందుకా?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now