IPL 2022: దటీజ్ ఫ్రెండ్‌షిప్.. పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన డ్వేన్ బ్రావో, అనంతరం ఆత్మీయ ఆలింగనం, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా.. సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు.
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా.. సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు. అదే విధంగా అనంతరం వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఇక పొలార్డ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరనీ షాక్‌కు గురి చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)