IPL 2022: రెండుసార్లు అదే యార్కర్‌కు బలైన జోస్ బ‌ట్ల‌ర్, లాకీ పెర్గూస‌న్ తెలివైన బౌలింగ్‌తో బ‌ట్ల‌ర్‌ను బోల్తా కొట్టించిన వీడియో వైరల్

ఐపీఎల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ మంచి ఊపు మీదున్నాడు. ప్ర‌స్తుతం 5 మ్యాచుల్లో 272 ర‌న్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు.తాజాగా గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఆరంభంలో బ‌ట్ల‌ర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. కేవ‌లం 23 బంతుల్లోనే అత‌ను 50 ర‌న్స్ చేశాడు.

Jos Buttler (Photo Credits: Twitter)

ఐపీఎల్ 2022లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ మంచి ఊపు మీదున్నాడు. ప్ర‌స్తుతం 5 మ్యాచుల్లో 272 ర‌న్స్ చేసి ఆరెంజ్ క్యాప్ కొట్టేశాడు.తాజాగా గుజ‌రాత్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఆరంభంలో బ‌ట్ల‌ర్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడుతూ వచ్చాడు. కేవ‌లం 23 బంతుల్లోనే అత‌ను 50 ర‌న్స్ చేశాడు. అయితే పేస్ బౌల‌ర్ లాకీ పెర్గూస‌న్ తెలివైన బౌలింగ్‌తో బ‌ట్ల‌ర్‌ను బోల్తా కొట్టించాడు. ఆర‌వ ఓవ‌ర్ అయిదో బంతిని బ‌ట్ల‌ర్ సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఇక ఆరో బంతిని ఫెర్గూస‌న్ చాలా తెలివిగా వేశాడు. స్లో లెగ్ క‌ట‌ర్‌తో బ‌ట్ల‌ర్‌ను ఖంగుతినిపించాడు. ఇదే టోర్నీలో జ‌రిగిన ఓ మ్యాచ్‌లోనూ బ‌ట్ల‌ర్ ఇలాగే స్లో యార్క‌ర్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రిచ‌ర్డ్‌స‌న్ వేసిన స్లో బంతిని బ‌ట్ల‌ర్ అంచ‌నా వేయ‌లేక ఔట‌య్యాడు. గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్ఆర్‌పై 37 ర‌న్స్ తేడాతో గుజ‌రాత్ జ‌ట్టు గెలిచింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now