IPL 2022: బుల్లెట్ కన్నా వేగం.. 139 కి.మీ స్పీడు, అద్భుత‌మైన యార్క‌ర్‌తో బ్యాట్స్‌మెన్‌కి చెమటలు పట్టించిన ముఖేష్ చౌద‌రి, బంతిని ఆప‌లేక కిందపడిన కిష‌న్ వీడియో వైరల్

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే య‌వ పేస‌ర్ ముఖేష్ చౌద‌రి అద్భుత‌మైన యార్క‌ర్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతికి కిష‌న్‌ డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

Mukesh Choudhary floors Ishan Kishan with toe-crushingc (Photo-Video Grab)

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే య‌వ పేస‌ర్ ముఖేష్ చౌద‌రి అద్భుత‌మైన యార్క‌ర్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతికి కిష‌న్‌ డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. అంతేకాకుండా 139 కి.మీ స్పీడుతో ముఖేష్ చౌద‌రి వేసిన బంతిని ఆప‌లేక కిష‌న్ కింద ప‌డిపోయాడు. దీంతో కిష‌న్ గోల్డ‌న్ డ‌క్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మ‌రోవైపు తొలి ఓవ‌ర్ రెండో బంతికే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను కూడా ముఖేష్ చౌద‌రి పెవిలియ‌న్‌కు పంపాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement