IPL 2022: దుమ్మురేపిన పంజాబ్, బెంగుళూరు విసిరిన 206 పరుగులను 19 ఓవర్లలోనే చేధింపు, చివర్లో మెరుపులు మెరిపించిన ఓడియన్ స్మిత్, షారుక్
18వ ఓవర్‌లో స్మిత్ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు సాధించడంతో ఉత్కంఠ వీడింది.
తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడకుండా ఓవర్‌కు పది రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. సమష్టి ఆటతీరుతో మరో ఓవర్ ఉండగానే నెగ్గింది. ధవన్ (43), రాజపక్స (43), మయాంక్ (32) విజయానికి బాటలు వేయగా.. చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఓడియన్ స్మిత్ (8 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 25 నాటౌట్), షారుక్ (24 నాటౌట్) చెలరేగారు. భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. 18వ ఓవర్‌లో స్మిత్ మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు సాధించడంతో ఉత్కంఠ వీడింది. అంతకుముందు అరంగేట్ర కెప్టెన్ డుప్లెసీ (57 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 88) తుఫాన్ ఇన్నింగ్స్‌తో బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. కోహ్లీ (41 నాటౌట్), దినేశ్ కార్తీక్ (32 నాటౌట్) రాణించారు.
బెంగళూరు: 20 ఓవర్లలో 205/2 (డుప్లెసీ 88, కోహ్లీ 41 నాటౌట్, దినేశ్ కార్తీక్ 32 నాటౌట్; రాహుల్ చాహర్ 1/22).
పంజాబ్: 19 ఓవర్లలో 208/5 (ధవన్ 43, రాజపక్స 43, స్మిత్ 25 నాటౌట్; సిరాజ్ 2/59).