Wayne Parnell Stunning Catch Video: అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన పార్నెల్, ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన వృద్ధిమాన్ సాహా, వీడియో ఇదిగో..

గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి 12 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన సాహాను పార్నెల్ అద్భుత క్యాచ్‌తో (Wayne Parnell Catch) పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని సాహా ఎక్స్‌ట్రా కవర్ వైపు బలంగా కొట్టాడు.

wayne-parnell (Photo-IPL)

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ (RCBvsGT) రసవత్తరంగా సాగింది.బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సెంచరీ కారణంగా గుజరాత్ ఛేదించింది. ఈ ఓటమితో బెంగళూరు ఐపీఎల్ 2023 (IPL 2023) నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాడు వేన్ పార్నెల్ (Wayne Parnell) అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు.

గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి 12 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన సాహాను పార్నెల్ అద్భుత క్యాచ్‌తో (Wayne Parnell Catch) పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని సాహా ఎక్స్‌ట్రా కవర్ వైపు బలంగా కొట్టాడు. అది బౌండరీయేనని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న పార్నెల్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో ఆ క్యాచ్ అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now