Kieron Pollard Retires: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన పొలార్డ్ వీడియో వైరల్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌

అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కానీ టీ20, టీ10 లీగ్‌లు ఆడుతానని పొలార్డ్‌ స్పష్టం చేశాడు. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

Kieron Pollard (Twitter/ICC)

అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కానీ టీ20, టీ10 లీగ్‌లు ఆడుతానని పొలార్డ్‌ స్పష్టం చేశాడు. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికేందుకు నిర్ణయించుకున్నా.

పదేండ్ల వయసులో విండీస్‌ జట్టు తరఫున ఆడాలని కలలు కన్నా. జాతీయ జట్టుకు 15 ఏండ్ల పాటు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నాడు. 34 ఏండ్ల పొలార్డ్‌ మొత్తం 123 వన్డేలు ఆడి 55 వికెట్లు పడగొట్టగా.. 2,706 పరుగులు చేశాడు. 101 టీ20ల్లో 1,569 రన్స్‌, 42 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అతడు చివరిసారి భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడడం గమనార్హం.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement