Jasprit Bumrah: వెన్ను నొప్పితో బుమ్రా.. భారత పేస్ దళపతి స్థానాన్ని భర్తీ చేయనున్న సిరాజ్

సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా నడుం నొప్పి వచ్చిందని ఫిర్యాదు చేయడంతో బుమ్రాని మ్యాచ్‌ నుంచి తప్పించారు. తర్వాత సిరీస్ నుంచి కూడా తప్పించారు. బుమ్రా స్థానంలో సిరాజ్ ను ఎంపిక చేశారు.

NewDelhi, September 30: టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో మిగిలిన రెండు టీ20లతో పాటు వచ్చే నెల ఆస్ట్రేలియాతో జరిగే టీ20 ప్రపంచ కప్ కు ఆయనను దూరం పెట్టారు. బుమ్రా స్థానంలో హైదరాబాదీ మొహమ్మద్ సిరాజ్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు టీ20లకు సిరాజ్ ను ఎంపిక చేసినట్టు ఒక ప్రకటనలో బీసీసీఐ తెలిపింది. బుమ్రా ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడని పేర్కొంది.  మరోవైపు 3 టీ20ల సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లో ఉంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్ ఆదివారం నాడు గువాహటిలో జరుగుతుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement