Rohit Sharma Video: రోహిత్ శర్మ సరికొత్త రికార్డు, యూట్యూబ్‌లో 10 కోట్లకు పైగా వీక్షణలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ శతకం వీడియో
2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్ పేజీలో 10 కోట్ల వ్యూస్ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్ పేజీలో 10 కోట్ల వ్యూస్ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం.
జూన్ 16, 2019లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో (వరల్డ్‌కప్) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (65 బంతుల్లో 77; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 చేసింది. ఛేదనకు దిగిన పాక్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా వర్షం పడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 40 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ 302 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే పాక్ 216 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)