Sarfaraz Khan Run Out Video: సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ వీడియో ఇదిగో, జడ్డూ మీద కోపంతో క్యాప్ తీసి నేలకేసి కొట్టిన కెప్టెన్ రోహిత్ శర్మ
సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు.
యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు. రోహిత్ శర్మ(131) అవుటైన తర్వాత అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు సర్ఫరాజ్. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన 26 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్ 48 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. సర్ఫరాజ్ కేవలం 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల 82వ ఓవర్లో రనౌటయ్యాడు.
భావోద్వేగానికి గురైన సర్ఫరాజ్ ఖాన్ తండ్రిని ఓదార్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీడియో వైరల్
ఆండర్సన్ బౌలింగ్‌లో జడ్డూ పరుగు తీసి సెంచరీ మార్కును అందుకునేందుకు సిద్ధం కాగా.. సర్ఫరాజ్ కూడా అతడికి సహకారం అందించేందుకు సన్నద్ధమయ్యాడు. అయితే, బంతిని గమనించిన జడేజా వెనక్కి వెళ్లగా.. అప్పటికే సర్ఫరాజ్ క్రీజు వీడాడు. బంతిని అందుకున్న ఫీల్డర్ మార్క్ వుడ్ స్టంప్‌నకు గిరాటేయగా.. సర్ఫరాజ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఈ పరిణామంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురై క్యాప్ తీసి నెలకేసి కొట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)