యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ఎట్టకేలకు టీమిండియాలోకి ఆరంగ్రేటం చేశాడు. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే చేతుల మీదుగా ఈ ముంబై బ్యాటర్‌ టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. ఆ సమయంలో తండ్రి నౌషధ్‌ ఖాన్‌, సర్ఫరాజ్‌ భార్య రొమానా జహూర్‌ అతడి పక్కనే ఉన్నారు. ఈ క్రమంలో తన క్యాప్‌ను తండ్రికి చూపించగా.. అతడు దానిని ఆప్యాయంగా ముద్దాడి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.వెంటనే సర్ఫరాజ్‌ వెళ్లి తండ్రిని ఆలింగనం చేసుకుని పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. రోహిత్ శర్మ సైతం సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి దగ్గరకు వెళ్లి విషెస్ తెలిపాడు. ఇక రొమానా సైతం కంటతడి పెట్టగా.. సర్ఫరాజ్‌ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఈ భావోద్వేగపూరిత సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సర్ఫరాజ్ ఖాన్ టీమిండియా క్యాప్ అందుకోగానే ఏడ్చేసిన తండ్రి, క్యాప్ అందుకోగానే బావోద్వేగంతో భార్య రోమానా జహూర్‌ను గుండెలకు హత్తుకున్న భారత క్రికెటర్

సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం మ్యాచ్‌ అన్న విషయాన్ని మరిచిపోయి యధేచ్ఛగా షాట్లు ఆడాడు. సర్ఫరాజ్‌ కేవలం​ 66 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డూ పొరపాటు వల్ల రనౌటయ్యాడు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)