Mondli Khumalo: దక్షిణాఫ్రికా క్రికెటర్‌పై UKలో దాడి, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు

ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు.

Mondli Khumalo (Photo-Twitter)

సౌతాఫ్రికా క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు UKలో దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు.మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్‌ ముగించుకొని ఇంటికి బయల్దేరే సమయంలో..బ్రిడ్జ్‌వాటర్‌ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్‌ స్ట్రీట్‌లో గ్రీన్‌ డ్రాగన్‌ పబ్‌ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్‌ టియాన్ కోకెమోర్ ట్విటర్‌ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్‌ చేశాడు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)