IPL 2022: ఏంటయ్యా రషీద్‌ ఖాన్‌ ఈ ఫీల్డింగ్, సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తున్న రషీద్‌ త్రో వీడియో

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో రషీద్‌ ఖాన్‌ మిస్‌ ఫీల్డింగ్‌ నవ్వులు పూయించింది. ప్రదీప్‌ సంగ్వాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో రెండో బంతిని ఇషాన్‌ కిషన్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. అయితే బంతిని అందుకున్న రషీద్‌ త్రో విసరడంలో విఫలమయ్యాడు.

Rashid Khan (left) and Rahul Tewatia (right) (Photo credit: Twitter)

ఐపీఎల్‌ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇన్నింగ్స్‌ సమయంలో రషీద్‌ ఖాన్‌ మిస్‌ ఫీల్డింగ్‌ నవ్వులు పూయించింది. ప్రదీప్‌ సంగ్వాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో రెండో బంతిని ఇషాన్‌ కిషన్‌ కవర్స్‌ దిశగా ఆడాడు. అయితే బంతిని అందుకున్న రషీద్‌ త్రో విసరడంలో విఫలమయ్యాడు. బంతి అతని కాళ్లను తాకి మళ్లీ వెనక్కి వచ్చింది. దీంతో మళ్లీ పరిగెత్తిన రషీద్‌ బంతిని అందుకోబోయి పట్టుతప్పి కిందపడ్డాడు. ఈసారి వేగంగా త్రో వేసినప్పటికి మిడిల్‌ స్టంప్‌ మిస్‌ అయి బౌండరీ దిశగా పరిగెట్టింది. ఇంతలో మరో ఫీల్డర్‌ బంతిని అందుకున్నాడు. ఈ గ్యాప్‌లో ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మలు రెండు రన్స్‌ పూర్తి చేశారు. ఇదంతా గమనించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా రషీద్‌ వద్దకు వచ్చి ఏంటిది అన్నట్లు నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement